వాళ్లకు పట్టాలు.. మాకు పొజిషన్ ​సర్టిఫికెట్లా!

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణాజిల్లా నందిగామ మండలం, చందాపురంలో గురువారం ఇళ్ల పట్టాల పంపిణీలో వివాదం చోటుచేసుకుంది. గ్రామంలో సుమారు 4 ఎకరాల 80 సెంట్ల భూమిని ఇళ్ల స్థలాలకు సేకరించారు. అందులో ఎకరం 84 సెంట్ల భూమి కోర్టు పెండింగ్‌లో ఉంది. ఎకరం 84 సెంట్లలో లబ్దిదారులకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. మిగిలినవారికి పట్టాలివ్వాలని అధికారులు నిర్ణయించారు. అయితే అందరికీ ఒకేసారి ఇవ్వాలని పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వైసీపీకి చెందిన వాళ్లు బహిష్కరించారు. కోర్టు వివాదంలో […]

Update: 2021-01-07 09:51 GMT

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణాజిల్లా నందిగామ మండలం, చందాపురంలో గురువారం ఇళ్ల పట్టాల పంపిణీలో వివాదం చోటుచేసుకుంది. గ్రామంలో సుమారు 4 ఎకరాల 80 సెంట్ల భూమిని ఇళ్ల స్థలాలకు సేకరించారు. అందులో ఎకరం 84 సెంట్ల భూమి కోర్టు పెండింగ్‌లో ఉంది. ఎకరం 84 సెంట్లలో లబ్దిదారులకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. మిగిలినవారికి పట్టాలివ్వాలని అధికారులు నిర్ణయించారు. అయితే అందరికీ ఒకేసారి ఇవ్వాలని పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వైసీపీకి చెందిన వాళ్లు బహిష్కరించారు. కోర్టు వివాదంలో ఉన్న భూమికి పొజిషన్​సర్టిఫికెట్లు, పట్టాలు ఎలా ఇస్తారంటూ వైసీపీకి చెందిన మరికొందరు ఆందోళనకు దిగారు. పార్టీ నియోజకవర్గ నాయకులు సహకరించడం లేదంటూ గ్రామస్తులు వైఎస్సార్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News