వివాదాస్పదంగా TRS ఎమ్మెల్యే తీరు.. తీవ్ర ఆగ్రహంలో స్థానికులు

దిశ ప్రతినిధి, ఖమ్మం : వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ తీరు నియోజకవర్గంలో రోజురోజుకూ వివాదాస్పదమవుతోంది. గతంలో కారేపల్లి మండలంలోని వెంకటియా తండాలో ప్రారంభించిన రోడ్లనే మళ్లీ ఓపెన్ చేసేందుకు వెళ్లగా గ్రామస్తులు అడ్డగించి తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా అదే కారేపల్లి మండలం భాగ్య నగర్ తండాలో గతంలో ప్రారంభించిన సబ్ స్టేషన్‌ను కొత్తగా నిర్మించి ఓపెన్ చేసినట్లు కలరింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే. మార్చి 25, 2016లో ఆర్ అండ్ బీ […]

Update: 2021-09-19 03:02 GMT

దిశ ప్రతినిధి, ఖమ్మం : వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ తీరు నియోజకవర్గంలో రోజురోజుకూ వివాదాస్పదమవుతోంది. గతంలో కారేపల్లి మండలంలోని వెంకటియా తండాలో ప్రారంభించిన రోడ్లనే మళ్లీ ఓపెన్ చేసేందుకు వెళ్లగా గ్రామస్తులు అడ్డగించి తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

తాజాగా అదే కారేపల్లి మండలం భాగ్య నగర్ తండాలో గతంలో ప్రారంభించిన సబ్ స్టేషన్‌ను కొత్తగా నిర్మించి ఓపెన్ చేసినట్లు కలరింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే. మార్చి 25, 2016లో ఆర్ అండ్ బీ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ ఉన్న సమయంలో అప్పుడు భాగ్య నగర్ తండాలో 33/11 సబ్ స్టేషన్ నిర్మించి ప్రారంభించారు. అయితే ఆ సబ్ స్టేషన్ కోసం స్థలం ఇచ్చిన వారికి ప్రభుత్వ హామీ ప్రకారం ఉద్యోగం ఇవ్వడం ఆలస్యమైంది. దీంతో భూమి ఇచ్చిన వారు సబ్ స్టేషన్‌కు తాళం వేయడంతో కొంత కాలం తర్వాత అక్కడి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

ఇటీవల వారికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించడంతో మళ్లీ ఆ సబ్ స్టేషన్ రన్నింగ్‌లోకి వచ్చింది. అయితే తిరిగి ఇప్పుడు అదే సబ్ స్టేషన్‌ను ఎమ్మెల్యే రాములు నాయక్, ఆయన అనుచరులు కొత్తగా నిర్మించి ప్రారంభించినట్లు ప్రచారం చేసుకోవడంతో గ్రామస్తులు, తుమ్మల మదన్ లాల్ అనుచరులు ఎమ్మెల్యే తీరుపై గుర్రుగా ఉన్నారు. ఇలా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అయిన వాటినే మళ్లీ ప్రారంభించడం.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే తీరుపై పలు మండలాల నుంచి నిరసన వ్యక్తం అవడంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎట్లండునో అంటూ ఆయన అనుచరులే గుసగుసలాడుకోవడం విశేషం.

Tags:    

Similar News