విషాదంలో మాక్లూర్ పోలీస్‌స్టేషన్.. కానిస్టేబుల్ రమణ గౌడ్ మృతి
దిశ, ఆర్మూర్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని మాక్లూర్ పోలీసుస్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ అకాల మరణం పొందారు. కానిస్టేబుల్ రమణ గౌడ్ కొంతకాలంగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం కుటుంబీకులు ఇటీవల హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. హైటెక్ సిటీలోని మెడీకవర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రమణ గురువారం తుదిశ్వాస విడిచారు. రమణగౌడ్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. దుబ్బాక సమీపంలోని ఓ పల్లెలో జన్మించిన రమణగౌడ్ బాల్యంలో నిజామాబాద్‌లో విద్యాభ్యాసం చేశారు. రమణ గౌడ్ […]
దిశ, ఆర్మూర్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని మాక్లూర్ పోలీసుస్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ అకాల మరణం పొందారు. కానిస్టేబుల్ రమణ గౌడ్ కొంతకాలంగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం కుటుంబీకులు ఇటీవల హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. హైటెక్ సిటీలోని మెడీకవర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రమణ గురువారం తుదిశ్వాస విడిచారు.
రమణగౌడ్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. దుబ్బాక సమీపంలోని ఓ పల్లెలో జన్మించిన రమణగౌడ్ బాల్యంలో నిజామాబాద్‌లో విద్యాభ్యాసం చేశారు. రమణ గౌడ్ తండ్రి కూడా పోలీసు శాఖలో రిటైర్డు ఉద్యోగి కావడం గర్వకారణం. మృతుడి అంత్యక్రియలు జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్‌లో నిర్వహించారు. ఆయన మరణం పట్ల మాక్లూర్ ఎస్సై రాజారెడ్డి, సహచర పోలీసులు సంతాపం వ్యక్తం చేశారు.