పోలీస్‌స్టేషన్ నుంచి మద్యం చోరీ కేసులో ఇద్దరి అరెస్టు

దిశ, కరీంనగర్: అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్న మద్యాన్ని పోలీసు స్టేషన్ నుంచి చోరీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి రిమాండుకు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం లాక్‌డౌన్ ప్రకటించడంతో మార్చి 22 నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనిని ఆసరాగా తీసుకుని కొంత మంది మద్యం అక్రమ రవాణా ప్రారంభించారు. కరీంనగర్ పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ మద్యం […]

Update: 2020-05-06 09:40 GMT

దిశ, కరీంనగర్: అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్న మద్యాన్ని పోలీసు స్టేషన్ నుంచి చోరీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి రిమాండుకు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం లాక్‌డౌన్ ప్రకటించడంతో మార్చి 22 నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనిని ఆసరాగా తీసుకుని కొంత మంది మద్యం అక్రమ రవాణా ప్రారంభించారు. కరీంనగర్ పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేశారు. అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలా స్వాధీనం చేసుకున్న మద్యాన్ని కరీంనగర్ టూటౌన్ పోలీస్ ‌స్టేషన్‌లో ఉంచారు. కానీ, ఠాణా నుంచి మద్యం మాయమైంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కానిస్టేబుల్ అరుణ్, తాత్కాలిక డ్రైవర్ రాణాలు మద్యం చోరీ చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో నిందితులిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

Tags: Karimnagar, constable, Arrest, two town police

Tags:    

Similar News