లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ కానిస్టేబుల్

దిశ, మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ రైటర్‌గా విధులు నిర్వహిస్తోన్న అంజిలయ్య అనే కానిస్టేబుల్ రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మొయినాబాద్‌లో అబ్దుల్ రహీమ్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని 2019లో ఓ కేసు విషయంలో పోలీసులు సీజ్ చేశారు. అయితే ఇటీవలే కోర్టు వాహనాన్ని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తన బైకును తీసుకెళ్లేందుకు స్టేషన్‌కు వచ్చిన రహీమ్‌ను క్రైమ్ […]

Update: 2021-12-03 10:58 GMT

దిశ, మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ రైటర్‌గా విధులు నిర్వహిస్తోన్న అంజిలయ్య అనే కానిస్టేబుల్ రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మొయినాబాద్‌లో అబ్దుల్ రహీమ్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని 2019లో ఓ కేసు విషయంలో పోలీసులు సీజ్ చేశారు. అయితే ఇటీవలే కోర్టు వాహనాన్ని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తన బైకును తీసుకెళ్లేందుకు స్టేషన్‌కు వచ్చిన రహీమ్‌ను క్రైమ్ రైటర్ అంజిలయ్య రూ.10వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో రహీమ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు కానిస్టేబుల్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అతడ్ని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News