ఆ సమయం మాకు చాలు.. కాంగ్రెస్ గెలుపు తథ్యం : ఠాగూర్
దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ కంటే ముందే తాము అభ్యర్థిని ప్రకటించామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ వెల్లడించారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవడానికి తమకు 224 గంటల సమయం సరిపోతుందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒకే కోవకు చెందినవని విమర్శించారు. మద్యం ఏరులై పారిస్తున్నా, కోట్లాది రూపాయలు వెదజల్లుతూ ప్రజాప్రతినిధులు, నాయకులను […]
దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ కంటే ముందే తాము అభ్యర్థిని ప్రకటించామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ వెల్లడించారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవడానికి తమకు 224 గంటల సమయం సరిపోతుందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒకే కోవకు చెందినవని విమర్శించారు.
మద్యం ఏరులై పారిస్తున్నా, కోట్లాది రూపాయలు వెదజల్లుతూ ప్రజాప్రతినిధులు, నాయకులను ప్రలోభాలకు గురి చేస్తున్నా ఎన్నికల సంఘం స్పందించడం లేదని విమర్శించారు. దసరా పండుగ సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీ డబ్బు, మద్యాన్ని పంపిణీ చేసిందని ఆరోపించారు. రోజురోజుకు పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని అన్నారు. నిరుద్యోగ సమస్యపై పోరాడుతున్న బల్మూరి వెంకట్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని అన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజల్ ధరలు పెంచడానికి కారణమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడతామన్నారు.