కొడంగల్‌లో రాజుకున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వర్సెస్ పోలీసులు

దిశ కొడంగల్ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి గతంలో కొడంగల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆయన సోదరుడే కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌గా కొనసాగడం భవిష్యత్తులో కూడ కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికలకు ముందే ఇక్కడ రాజకీయం తార స్థాయికి చేరింది. ప్రస్తుతం నియోజకవర్గం అటు నారాయణపేట రెండు మండలాలు ఇటు వికారబాద్ జిల్లాలో రెండు మండలాలు […]

Update: 2021-10-20 00:23 GMT

దిశ కొడంగల్ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి గతంలో కొడంగల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆయన సోదరుడే కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌గా కొనసాగడం భవిష్యత్తులో కూడ కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికలకు ముందే ఇక్కడ రాజకీయం తార స్థాయికి చేరింది. ప్రస్తుతం నియోజకవర్గం అటు నారాయణపేట రెండు మండలాలు ఇటు వికారబాద్ జిల్లాలో రెండు మండలాలు ఉండటంతో గడిచిన రెండు మూడు నెలలు నుంచి ఏ కార్యక్రమం చేసిన ప్రతిపక్ష పార్టీలు పోలీసులు ప్రధానంగా పోలీసులపై ఆరోపణలు చేయడంతో నియోజకవర్గంలో ఏం జరుగుతుందో జనాలకు కూడా అర్థం కాని పరిస్థితి తయారైంది.

గతంలో మద్దూరు మండలంలోని ఓ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం తొలగింపు, అక్రమ ఇసుక రవాణా భారీ మొత్తంలో జరుగుతుందని.. ఇందులో ఎమ్మెల్యే గారి హస్తం ఉందని దీనికి సహాకరించేది ఎమ్మెల్యే గారే అని అక్కడి స్థానిక నాయకులు ఆరోపణలు చేశారు. అలాగే కోస్గి మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాయకులపై పోలీసు యంత్రాంగం అనవసరంగా అధికార పార్టీ కనుసైగలో పని చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గత రెండు రోజుల క్రితం బొమ్మరాసుపేట మండలంలో రెండు వర్గాల మధ్య గొడవలో పోలీసులు ఓ వర్గంకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, సుమారు వంద మంది పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగడంతో పరిస్థితితులు ఉద్రిక్తతకు దారి తీసాయి.

కొడంగల్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెరిగిన డిజిల్ పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఇందులో కూడా యూత్ కాంగ్రెస్ నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేస్తూనే మరో పక్క పోలీస్‌లపై ఆరోపణలు చేయడం జరిగింది. వాస్తవంగా పోలీసుల పై ఆరోపణలు చేయడం వెనుక రెండు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల స్వలాభం కోసం మాత్రమే అని ఇందులో ప్రజలకు కానీ కొడంగల్ అభివృద్ధికీ కానీ ఎలాంటి ప్రయోజనం లేదు అని ప్రజల వాదన. అభివృద్ధిని చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ అనవసరంగా వారి ఉనికి కోసం ఏం మాట్లాడాలో అర్థంకాక ఎమ్మెల్యేకు వస్తున్న ప్రజా దరణ చూసి ఓర్వలేక పోలీసులపై ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యేను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకుల వాదన. మరి చూడాలి రానున్న రోజుల్లో కొడంగల్ రాజకీయం ఏ విధంగా ఉండబోతుందో.

Tags:    

Similar News