మంత్రి హరీష్ రావుకు షాకిచ్చిన కాంగ్రెస్
దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి హరీష్‌రావు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆల్ ఇండియా కిసాన్కాంగ్రెస్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి రాష్ర్ట ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రిని వెంటనే హుజూరాబాద్నియోజకవర్గం నుంచి తిప్పి పంపించాలని కోరారు. ఈ మేరకు ఆయన రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ శషాంక్గోయల్కు ఆదివారం లేఖ రాశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్న హరీష్‌రావు గత నెల రోజుల నుంచి హుజూరాబాద్‌లో ప్రచారం పేరిట ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు […]
దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి హరీష్‌రావు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆల్ ఇండియా కిసాన్కాంగ్రెస్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి రాష్ర్ట ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రిని వెంటనే హుజూరాబాద్నియోజకవర్గం నుంచి తిప్పి పంపించాలని కోరారు. ఈ మేరకు ఆయన రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ శషాంక్గోయల్కు ఆదివారం లేఖ రాశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్న హరీష్‌రావు గత నెల రోజుల నుంచి హుజూరాబాద్‌లో ప్రచారం పేరిట ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు లేఖలో ఆరోపించారు.
ఆయన క్యాంపెయిన్‌లో వ్యవహరిస్తున్న శైలిని గమనిస్తే ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుందన్నారు. దీంతో ఆయనను కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాతనే ప్రచారానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఆయన నిత్యం నియోజకవర్గంలో తిరగడం వలన ఎన్నికల వాతావరణం కూడా ఇబ్బంది కరంగా మారిందని లేఖలో స్పష్టం చేశారు. మంత్రిగా ఓటర్లను ప్రభావితం చేయడం కేంద్ర ఎన్నికల నిబంధనలకూ విరుద్ధమని గుర్తుచేశారు.