తెలకపల్లి వద్ద రేవంత్‌రెడ్డి అరెస్ట్
దిశ, నాగర్ కర్నూల్: వరద నీటిలో మునిగిపోయిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్ట్ ఏల్లూరు వద్ద పంప్ హౌస్‌ను సందర్శించేందుకు వెళ్లిన ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. తెలకపల్లి రోడ్డుపై కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. […]
దిశ, నాగర్ కర్నూల్: వరద నీటిలో మునిగిపోయిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్ట్ ఏల్లూరు వద్ద పంప్ హౌస్‌ను సందర్శించేందుకు వెళ్లిన ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. తెలకపల్లి రోడ్డుపై కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అరెస్ట్ చేయాల్సింది మమ్మల్ని కాదు.. సీఎం కేసీఆర్‌తో పాటు ఈ ఘటనకు కారణమైన కాంట్రాక్టర్లను అరెస్ట్ చేయాలని ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తాను నియమించిన అధికారులు ఇచ్చిన నివేదికలు పక్కనపెట్టి ఒక కాంట్రాక్టర్ ఇచ్చిన సలహాలతో కేసీఆర్ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిండా ముండా ముంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.