ఆ నలుగురికి సాయం చేయడమే ప్రధాని లక్ష్యం

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ నేత‌ృత్వంలోని కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతిని కలిశారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సేకరించిన 2 కోట్ల సంతకాలతో కూడిన వినతి పత్రాలను రాష్ట్రపతికి అందజేశారు. కాంగ్రెస్ ర్యాలీని ఏఐసీసీ కార్యాలయం దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. ప్రియాంకగాంధీ సహా కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. […]

Update: 2020-12-24 02:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ నేత‌ృత్వంలోని కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతిని కలిశారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సేకరించిన 2 కోట్ల సంతకాలతో కూడిన వినతి పత్రాలను రాష్ట్రపతికి అందజేశారు. కాంగ్రెస్ ర్యాలీని ఏఐసీసీ కార్యాలయం దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. ప్రియాంకగాంధీ సహా కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కార్పొరేట్ల కంపెనీలకు సాయం చేయడమే ప్రధాని మోదీ లక్ష్యమని విమర్శించారు. ప్రధానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా.. వారిని ఉగ్రవాదులుగా ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడినా కేంద్రం అదే ముద్రను వేస్తుందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదని.. అది కేవలం ఊహాల్లో మాత్రమే ఉందని చురకలంటించారు. రైతులు చట్టబద్ధంగానే నిరసన తెలుపుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలను నిర్వహించి వెంటనే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ నిర్ణయంతో కోట్ల మంది జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. ప్రధాని మోదీ అసమర్ధుడు అని.. ఆయనకు ఏమీ అర్థం కావడం లేదని మండిపడ్డారు. కేవలం ముగ్గురు, నలుగురి కోసమే మోదీ పని చేస్తున్నారని విమర్శించారు.

Tags:    

Similar News