ఆసక్తి రేపుతోన్న సింగరేణి ఎన్నికలు.. బరిలోకి సీతక్క..?

దిశ, గోదావరిఖని: దేశానికి వెలుగునిచ్చే సింగరేణి సంస్థలో నల్ల సూర్యుల తీర్పు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని నెలకొల్పుతుంది. సింగరేణి విస్తరించి ఉన్న ఆరు జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో జరిగే కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలుపే లక్ష్యంగా పని చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ఎన్నికల్లో పోటీకి […]

Update: 2021-08-23 21:55 GMT

దిశ, గోదావరిఖని: దేశానికి వెలుగునిచ్చే సింగరేణి సంస్థలో నల్ల సూర్యుల తీర్పు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని నెలకొల్పుతుంది. సింగరేణి విస్తరించి ఉన్న ఆరు జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో జరిగే కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలుపే లక్ష్యంగా పని చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ఎన్నికల్లో పోటీకి ఏ విధంగా వెళ్ళాలి. ఎలా చేయాలి. ప్రతిపక్ష నేతలకు ఎలా సమాధానాలు చెప్పాలి అనే దానిపై వ్యూహం రచిస్తున్నట్లు సింగరేణిలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

విపక్షాల ఎత్తులకు పై ఎత్తులు వేసి కార్మికులను తమ వైపు తిప్పుకొనేందుకు ఏం చేయాలి అనే దానిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక సంఘాల నాయకులతో ప్రత్యేక చర్చలు జరిపినట్టు సమాచారం. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. సింగరేణి వ్యాప్తంగా 12 సెగ్మెంట్లలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రభుత్వం బూస్టింగ్ గా భావిస్తుంది. అందుకే సింగరేణిలో జరిగే ఎన్నికలకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలను తీసుకుంటూ వ్యూహాలను రచిస్తోంది. గుర్తింపు సంఘం ఎన్నికలలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఓటమి పాలు అయితే రానున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం సింగరేణి వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పడుతుందనే ఆలోచనలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ నాయకులు ఈ ఎన్నికలను చాలెంజ్ గా తీసుకొని బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పదవి కాలం ముగిసి ఎప్పుడో నిర్వహించాల్సిన కార్మిక సంఘం ఎన్నికలు ప్రతిసారి వాయిదా పడుతూ వస్తున్నాయి. గత రెండు నెలల క్రితమే రావాల్సిన సింగరేణి ఎన్నికల నగరా హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. హుజరాబాద్ లో ఉప ఎన్నిక ముగిసిన వెంటనే నవంబర్ మొదటివారంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ గుర్తింపు సంఘం సింగరేణి ఎన్నికల్లో మరోసారి మంత్రులు ఎమ్మెల్యేలను ప్రచారంలోకి దింపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.

గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి నాలుగు సంవత్సరాలు..?

సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు సంఘం ఎన్నికలు అక్టోబర్ 2017 న ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గుర్తింపు సంఘం కాలపరిమితి రెండు సంవత్సరాలు అయినా అప్పటి నుండి కోర్టు కేసులు తదితర సమస్యలతో వాయిదా పడుతూ వస్తుంది. అక్టోబర్ 5వ తేదీ తో సింగరేణి లో ఎన్నికలు జరిగి నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది. గతంలో సైతం సార్వత్రిక ఎన్నికల ముందే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను ప్రభుత్వం నిర్ణయించింది. అదే తరహాలో మరోసారి గుర్తింపు సంఘం ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది.

గుర్తింపు సంఘం ఎన్నికల రంగంలోకి సీతక్క..?

సింగరేణిలో జరిగే గుర్తింపు సంఘం ఎన్నికలను కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గుర్తింపు సంఘం ఎన్నికలలో కార్మికుల తీర్పు ప్రతిసారీ వైవిధ్యంగా ఉంటుంది. అయితే అధికార పార్టీ టీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలు కవిత గత కొన్ని సంవత్సరాలుగా ఉండటంతో ఇదే తరహాలో ఈసారి కార్మిక సంఘం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఐఎన్ టీయూసీ గౌరవ అధ్యక్షురాలుగా సీతక్క ను నియమించేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తుంది. సింగరేణి ఎన్నికలపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించి రేవంత్ రెడ్డి సీతక్కతో ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయా వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇప్పటికే ఆయా కార్మిక సంఘం నాయకులతో వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి:

కేటీఆర్‌కు తలనొప్పిగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. హుజూరాబాద్‌ ఎన్నికపై అసంతృప్తి

ఆయన సెలవు తీసుకున్నా సగం వేతనం ఇవ్వండి.. వివాదస్పదంగా సర్కార్ ఆర్డర్

Tags:    

Similar News