మేం అలర్ట్ చేస్తే కేసీఆర్ చెవికెక్కలేదు !
దిశ, న్యూస్‌బ్యూరో: పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ విషయంలో ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కార్యచరణను వేగవంతం చేస్తున్నారు. ఓవైపు కేసీఆర్ సర్కార్‌ను విమర్శిస్తూనే కేంద్రం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. బుధవారం గాంధీ భవన్‌లో దీక్ష అనంతరం కేసీఆర్, మంత్రులపై వ్యాఖ్యలను తీవ్రతరం చేసిన హస్తం పార్టీ నేతలు గురువారం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌కు మెమోరండం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 2019 […]
దిశ, న్యూస్‌బ్యూరో: పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ విషయంలో ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కార్యచరణను వేగవంతం చేస్తున్నారు. ఓవైపు కేసీఆర్ సర్కార్‌ను విమర్శిస్తూనే కేంద్రం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. బుధవారం గాంధీ భవన్‌లో దీక్ష అనంతరం కేసీఆర్, మంత్రులపై వ్యాఖ్యలను తీవ్రతరం చేసిన హస్తం పార్టీ నేతలు గురువారం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌కు మెమోరండం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 2019 డిసెంబర్ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సీఎం జగన్ పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతామని మాట్లాడితే కేసీఆర్ స్పందించలేదన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశాల్లో ముఖ్యమంత్రిని అలర్ట్ చేస్తే చెవినపెట్టలేదని మండిపడ్డారు. కేసీఆర్, జగన్ రెండుసార్లు వింధు భోజనాలు చేసినప్పుడు పోతిరెడ్డిపాడుపై చర్చించలేదా అని సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ మౌనాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికైనా కేసీఆర్ నిర్లక్ష్య ధోరణి వీడాలని హెచ్చరించారు. ప్రాజెక్ట్ విషయంలో ఏపీ సర్కార్ ముందుకు పోతూ భూసేకరణను కూడా స్పీడప్ చేస్తుందన్నారు. కృష్ణా రివర్ బోర్డు సమర్థంగా పనిచేయకుంటే ఏ రాష్ట్రం ఎంత నీరు వాడుకుంటుందో తెలియని పరిస్థితి ఉంటుందన్నారు.