కోడ్‌ ఉల్లంఘన..ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలి

దిశ, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఈసీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. శుక్రవారం మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ అభ్యర్థి సుభాష్ రెడ్డి‌లు ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, […]

Update: 2020-05-22 08:12 GMT

దిశ, నిజామాబాద్ :
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఈసీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. శుక్రవారం మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ అభ్యర్థి సుభాష్ రెడ్డి‌లు ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను అధికార పార్టీ నాయకులు భయ బ్రాంతులకు గురి చేసి గులాబీ కండువాలు కప్పుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కోడ్‌ నియమ నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరించిన వారిపై వెంటనే చర్యలకు ఆదేశించాలని ఈసీని కోరారు.

Tags:    

Similar News