బీజేపీ మత రాజకీయాలు చేయొద్దు

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నేతలు మత రాజకీయాలు మానుకొని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన జాతీయ పార్టీగా బీజేపీ నేతలు సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా మత రాజకీయాలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు కావడం లేదని మండిపడ్డారు. కరోనాను ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్రాలు చేతులు ఎత్తేశాయని, జీడీపీ వృద్ధి పడిపోయిందన్నారు. నిరుద్యోగం విలయతాండవం చేస్తుంటే మూడు రాజధానుల పేరిట రాష్ట్రానికి ఒక్క రాజధాని లేకుండా […]

Update: 2020-09-12 05:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నేతలు మత రాజకీయాలు మానుకొని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన జాతీయ పార్టీగా బీజేపీ నేతలు సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా మత రాజకీయాలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు కావడం లేదని మండిపడ్డారు. కరోనాను ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్రాలు చేతులు ఎత్తేశాయని, జీడీపీ వృద్ధి పడిపోయిందన్నారు. నిరుద్యోగం విలయతాండవం చేస్తుంటే మూడు రాజధానుల పేరిట రాష్ట్రానికి ఒక్క రాజధాని లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల ఏర్పాటుతో రైతులు కంటినిండ నిద్ర లేకుండా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News