దొంగ ఓట్లతో గెలిచిందీ ఓ గెలుపేనా ?: తులసిరెడ్డి

దిశ, ఏపీ బ్యూరో: బద్వేలు ఉపఎన్నికలో వైసీపీ ఘన విజయంపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బద్వేలు ఉపఎన్నికల్లో 1,47,213 ఓట్లు పోలయ్యాయని.. అందులో ప్రజలు 40 శాతం మాత్రమే ఓట్లు వేశారని తెలిపారు. మిగిలిన 60శాతం దొంగఓట్లు వేశారని ఆరోపించారు. ఈ మొత్తం ఓట్లలో దాదాపు 90 వేలు దొంగ ఓట్లు వేశారని ఆయన ఆరోపించారు. కేవలం 56 వేల ఓట్లు ప్రజలు వేశారని చెప్పుకొచ్చారు. దొంగ ఓట్లతో గెలిచిందీ ఓ […]

Update: 2021-11-02 03:03 GMT

దిశ, ఏపీ బ్యూరో: బద్వేలు ఉపఎన్నికలో వైసీపీ ఘన విజయంపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బద్వేలు ఉపఎన్నికల్లో 1,47,213 ఓట్లు పోలయ్యాయని.. అందులో ప్రజలు 40 శాతం మాత్రమే ఓట్లు వేశారని తెలిపారు. మిగిలిన 60శాతం దొంగఓట్లు వేశారని ఆరోపించారు. ఈ మొత్తం ఓట్లలో దాదాపు 90 వేలు దొంగ ఓట్లు వేశారని ఆయన ఆరోపించారు. కేవలం 56 వేల ఓట్లు ప్రజలు వేశారని చెప్పుకొచ్చారు. దొంగ ఓట్లతో గెలిచిందీ ఓ గెలుపేనా అంటూ తులసిరెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు ఈసారి ఉపఎన్నికల్లో కూడా ప్రలోభాలకు గురి చేసిందన్నారు. ఉదయం 11 గంటల తర్వాత వైసీపీ కార్యకర్తలు రాయలసీమలోని పలు ప్రాంతాల నుంచి ఇతర వ్యక్తులను తీసుకువచ్చి దొంగఓట్లు వేయించారని తులసిరెడ్డి ఆరోపించారు.

Tags:    

Similar News