ఎర్రబెల్లిని ‘ఊపుతున్న’ వివాదం.. తగ్గేదేలే అంటున్న ప్రతిపక్షాలు

దిశ, నర్సంపేట : మహిళా అధికారిణి పట్ల డబుల్ మీనింగ్ మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భేషరతుగా క్షమాపణ చెప్పాలని నల్లబెల్లిమండల అధ్యక్షులు చిట్యాల తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌ పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళ ఎంపీడీవోని అవహేళన చేస్తూ సభలో అవమాన పరిచారన్నారు. గౌరవప్రదమైన మంత్రి హోదాలో ఉండి మహిళా లోకం తలదించుకునే విధంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. […]

Update: 2021-07-10 03:34 GMT

దిశ, నర్సంపేట : మహిళా అధికారిణి పట్ల డబుల్ మీనింగ్ మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భేషరతుగా క్షమాపణ చెప్పాలని నల్లబెల్లిమండల అధ్యక్షులు చిట్యాల తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌ పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళ ఎంపీడీవోని అవహేళన చేస్తూ సభలో అవమాన పరిచారన్నారు. గౌరవప్రదమైన మంత్రి హోదాలో ఉండి మహిళా లోకం తలదించుకునే విధంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఆయన్ని వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలన్నారు. లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, జిల్లా కాంగ్రెస్ డెలిగేట్ జిల్లమునెందర్, మాజీ ఎంపీటీసీ ఇస్తారు, శేఖర్ జెట్టి రామ్మూర్తి, మాజీ సర్పంచ్ శంకరయ్య, నారక్కపెట్ గ్రామ ఉపసర్పంచ్ వడ్లూరి రమేష్, నల్లబెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకలమర్రి మురళి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News