కాంగ్రెస్ క్యాడర్ కదిలింది… ఎదురుదాడి మొదలైందా..?
దిశ ప్రతినిధి, వరంగల్ : కొన్ని కొన్ని రాజకీయ అంశాలు చిన్న విషయాలుగానే కనిపిస్తుంటాయి.. కానీ అవి జరిగే సమయం, సందర్భాన్ని బట్టి మాత్రం ప్రాధాన్యమే కాదు… పార్టీలోని అభిప్రాయాలను, ఉద్దేశాలను వెల్లడిస్తుంటాయి. ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్ కదిలిన సంకేతాలు… టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కౌంటర్ అటాక్‌కు దిగిన దృశ్యాలు కనిపించడం గమనార్హం. శనివారం హైదరాబాద్ టీఆర్ఎస్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, రోహిత్‌రెడ్డిలు రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన […]
దిశ ప్రతినిధి, వరంగల్ : కొన్ని కొన్ని రాజకీయ అంశాలు చిన్న విషయాలుగానే కనిపిస్తుంటాయి.. కానీ అవి జరిగే సమయం, సందర్భాన్ని బట్టి మాత్రం ప్రాధాన్యమే కాదు… పార్టీలోని అభిప్రాయాలను, ఉద్దేశాలను వెల్లడిస్తుంటాయి. ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్ కదిలిన సంకేతాలు… టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కౌంటర్ అటాక్‌కు దిగిన దృశ్యాలు కనిపించడం గమనార్హం. శనివారం హైదరాబాద్ టీఆర్ఎస్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, రోహిత్‌రెడ్డిలు రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యేను కొనబోయి దొరికిన దొంగవి.. సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని బ్లాక్ మెయిలర్ గా ఎదిగిన నేతవు నువ్వంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ముగ్గురు ఎమ్మెల్యేలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌లోని కింది స్థాయి శ్రేణులు మండిపడ్డాయి. వాస్తవానికి పెద్ద నేతలెవరూ ప్రకటనలు, ఖండించడం చేయకపోయినా కాంగ్రెస్‌లోని కింది స్థాయి నేతలు స్వయంగా రోడ్డెక్కి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తీరుపై విరుచుకుపడటం కొత్త పరిణామమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై నియోజకవర్గ నేత డాక్టర్ వడ్డెపల్లి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వ, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దహనం చేయడం గమనార్హం. గతంలో కాంగ్రెస్ నేతలపైనా నేరుగా ఎన్నోసార్లు విమర్శలు చేసినా పెద్దగా స్పందన కనిపించేది కాదు. పార్టీ శ్రేణుల్లో వచ్చిన చైతన్యానికి, రేవంత్‌కు మద్దతుగా నిలిచేందుకు శ్రేణులు సిద్ధమయ్యారనే దానికి ఈ పరిణామం నిదర్శనమంటూ కొంతమంది విశ్లేషిస్తున్నారు.