మాజీ కలెక్టర్ చేసిన పనికి.. ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్ అభినందనలు

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలోని కొన్ని మరుగుదొడ్లను శుభ్రం చేసిన మాజీ ఐఏఎస్ ​అధికారి ఆకునూరి మురళిని.. బీఎస్పీ స్టేట్​కన్వీనర్​ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​శుక్రవారం ట్విట్టర్​వేదికగా అభినందించారు. మురళి మరుగుదొడ్లను కడిగి కళంకాలను తొలగించే గొప్ప ప్రయత్నం చేశారని కొనియాడారు. వందల ఏళ్లుగా వాటిని శుభ్రం చేస్తున్న వారి దుస్థితిని అందరూ ఊహించుకోవాలని సూచించారు. ఆకునూరి మురళికి ఒక మిలియన్ ధన్యవాదాలని తెలిపారు. ఇదిలా ఉండగా తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ మురళి వీఆర్ఎస్ […]

Update: 2021-11-19 11:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలోని కొన్ని మరుగుదొడ్లను శుభ్రం చేసిన మాజీ ఐఏఎస్ ​అధికారి ఆకునూరి మురళిని.. బీఎస్పీ స్టేట్​కన్వీనర్​ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​శుక్రవారం ట్విట్టర్​వేదికగా అభినందించారు. మురళి మరుగుదొడ్లను కడిగి కళంకాలను తొలగించే గొప్ప ప్రయత్నం చేశారని కొనియాడారు. వందల ఏళ్లుగా వాటిని శుభ్రం చేస్తున్న వారి దుస్థితిని అందరూ ఊహించుకోవాలని సూచించారు. ఆకునూరి మురళికి ఒక మిలియన్ ధన్యవాదాలని తెలిపారు. ఇదిలా ఉండగా తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ మురళి వీఆర్ఎస్ తీసుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు. అయితే, శుక్రవారం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ఆయన వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఆయన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లోని మరుగుదొడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలంతా మరుగుదొడ్లను వినియోగించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి తన ట్వీట్​లో పిలుపునిచ్చారు. చాలా మంది ప్రజలకు ఇప్పటికీ మరుగుదొడ్ల వినియోగంపై అనుమానాలు ఉన్నాయని, అవి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని స్వయంగా ఆయనే స్కూల్ లోని టాయిలెట్‌ను కడిగారు.

Tags:    

Similar News