చేపల కోసం గొడవ.. కేసు నమోదు

దిశ, అమరావతి: చేపల కోసం రెండు గ్రామాలు బాహాబాహీకి దిగిన ఘటన.. అనంతపురం జిల్లా రొద్దం మండలం తురకలపట్నంలో గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పెద్ద కోడిపల్లి, తురకలపట్నం గ్రామాల మధ్య చెరువు వుంది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువుకు భారీగా వరద వచ్చి పడింది. గతంలో పెద్దకోడిపల్లి గ్రామానికి చెందిన చేపల కమిటీ సొసైటీ ఉందని, కాబట్టి చెరువుపై అధికారం తమకే ఉందని ఆ గ్రామస్తుల మాట. తురకలపట్నం గ్రామంలో చెరువు వుంది కాబట్టి అది […]

Update: 2020-07-05 02:05 GMT

దిశ, అమరావతి: చేపల కోసం రెండు గ్రామాలు బాహాబాహీకి దిగిన ఘటన.. అనంతపురం జిల్లా రొద్దం మండలం తురకలపట్నంలో గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పెద్ద కోడిపల్లి, తురకలపట్నం గ్రామాల మధ్య చెరువు వుంది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువుకు భారీగా వరద వచ్చి పడింది. గతంలో పెద్దకోడిపల్లి గ్రామానికి చెందిన చేపల కమిటీ సొసైటీ ఉందని, కాబట్టి చెరువుపై అధికారం తమకే ఉందని ఆ గ్రామస్తుల మాట. తురకలపట్నం గ్రామంలో చెరువు వుంది కాబట్టి అది తమదే అన్న వాదన ఈ గ్రామ ప్రజలది. దీంతో ఇరు గ్రామాల ప్రజల మధ్య వాదోపవాదనలు చేసుకున్నారు. మాటకుమాట పెరగడంతో కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇరు గ్రామాల వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Tags:    

Similar News