కరోనా వల్ల రెండు వర్గాల మధ్య ఘర్షణ
దిశ, మధిర: కరోనా వైరస్ మీ వల్లే గ్రామంలో సోకిందని ఒక వర్గం ఆరోపించగా.. అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ప్రత్యర్థి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ సంఘటన గురువారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం నరసింహాపురంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. నరసింహాపురంలో కొందరికి కొవిడ్ సోకింది అని లేని వారికి కూడా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారంటూ ఓ వర్గం వారు వైరస్ సోకిన వ్యక్తి ఇంటిపై దాడి చేశారు. దీంతో అది […]
దిశ, మధిర: కరోనా వైరస్ మీ వల్లే గ్రామంలో సోకిందని ఒక వర్గం ఆరోపించగా.. అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ప్రత్యర్థి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ సంఘటన గురువారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం నరసింహాపురంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. నరసింహాపురంలో కొందరికి కొవిడ్ సోకింది అని లేని వారికి కూడా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారంటూ ఓ వర్గం వారు వైరస్ సోకిన వ్యక్తి ఇంటిపై దాడి చేశారు. దీంతో అది రెండు వర్గాల వివాదంగా మారి ఒకరిపై మరొకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇరువర్గాలకు చెందిన అయిదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఇరువర్గాలు ఒకరిపై మరొకరు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి కేసు నమోదు చేస్తామని ఎస్సై ఉమా తెలిపారు.