షరతులతో లాక్ డౌన్ సడలిద్దాం.. ప్రధానితో జగన్
కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. ఈ సందర్భంగా ప్రధానికి సీఎంలు తమతమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పర భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ను పొడిగించడమే మంచిదని ప్రధానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించగా.. ఏపీ సీఎం జగన్ మాత్రం.. ప్రధాని నాయకత్వ లక్షణాలపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. మీరు సూచించిన వ్యూహంతోనే ముందుకెళ్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పక్కా […]
కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. ఈ సందర్భంగా ప్రధానికి సీఎంలు తమతమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పర భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ను పొడిగించడమే మంచిదని ప్రధానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించగా..
ఏపీ సీఎం జగన్ మాత్రం.. ప్రధాని నాయకత్వ లక్షణాలపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. మీరు సూచించిన వ్యూహంతోనే ముందుకెళ్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పక్కా ప్రణాళికతో లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నామని జగన్ అన్నారు. రాష్ట్రంలో 141 కంటైన్మెంట్ క్లస్టర్లను గుర్తించామని తెలిపారు.
ఇక లాక్ డౌన్ ను కొన్ని షరతులతో సడలించాలని సూచించారు. రెడ్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో లాక్ డౌన్ ను సడలించాలని అన్నారు. సినిమా హాల్స్, మాల్స్, స్కూళ్లు తప్ప… మిగిలిన వాటిని లాక్ డౌన్ నుంచి మినహాయించాలని చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వైద్యం అందిస్తున్నామని, దాదాపు 30 వేల మంది వైద్య సిబ్బంది విధుల్లో ఉన్నారని తెలిపారు.
Tags: ysrcp, ap cm, Jagan, pm modi, video conference