Former Minister: ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తున్నారు.. అయినా భయపడం..!
రాష్ట్రవ్యాప్తంగా అరెస్ట్‌ల నేపథ్యంలో మాజీ మంత్రి విడదల రజినీ సంచలన వ్యాఖ్యలు చేశారు...
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా(Social Media)లో అసభ్య పోస్టుల(Indecent Posts)పై కూటమి ప్రభుత్వం(Coalition Government) ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టులు పెట్టిన పలువురు వైసీపీ కార్యకర్తల(YCP workers)ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేయగా మరికొంతమందిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ చిలకలూరిపేట ఇంచార్జి విడదల రజినీ(Former minister, YCP Chilakaluripet in charge released Vidadala Rajini) స్పందించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారని ఆమె తెలిపారు.
ప్రజలు తరపున ప్రశ్నిస్తున్నామని, అది తట్టుకోలేక అరెస్ట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అణచివేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల వాయిస్‌ను వినిపిస్తున్న తమ కార్యకర్తలను అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. ప్రశ్నించకుండా ఉండాలనే ఉద్దేశంతోనే తమ పార్టీ నేతలు, కార్యకర్తల గొంతు నొక్కేస్తున్నారని, ఎలాంటి పరిణామాలకైనా భయపడేది లేదని విడదల రజినీ పేర్కొన్నారు.