Harish Rao : రేవంత్.. వరంగల్ వేదికగా క్షమాపణలు చెప్పాలి : ఎక్స్‌లో హరీశ్ రావు డిమాండ్
విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండని మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా (CM Revanth Reddy) రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. (Congress) కాంగ్రెస్ అన్ని వర్గాలను సక్సెస్ ఫుల్‌గా మోసం చేసిందని, వరంగల్ వేదికగా అన్ని వర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. (Warangal Declaration) వరంగల్ డిక్లరేషన్, మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని కోరారు. పది నెలల్లో రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకువెళ్లారని విమర్శించారు.
‘ఎవరనుకున్నారు, ఇట్లవునని ఎవరనుకున్నారు’ ప్రజాకవి కాళోజీ చెప్పినట్లు కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగా పడ్డారని ఆరోపించారు. రైతులు దారుణంగా మోసపోయారని పేర్కొన్నారు. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, అపజయాలను కప్పిపుచ్చుకునేందుకు వరంగల్ వేదికగా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఏం సాధించారని సంబరాలు జరుపుకుంటున్నారు రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. ఇదే (Warangal) వరంగల్ వేదికగా ఇచ్చిన రైతు డిక్లరేషన్‌కు ఏడాది అయినా అతీగతీ లేదన్నారు. (KCR) కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ, నేడు తిరోగమనం బాట పట్టిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేసే దుస్థితి ఏర్పడిందన్నారు. వద్దురో నాయనా కాంగ్రెస్ పాలన అంటూ పాటలు పాడుకుంటున్న పరిస్థితి వచ్చిందన్నారు.