Supreme Court: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. అవినాష్‌రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు
వైఎస్ వివేకా (YS Viveka) హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ వివేకా (YS Viveka) హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి (MP YS Avinash Reddy)కి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి (Sunitha Reddy) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా (Chief Justice Sanjeev Khanna) నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కేసులో అప్రూవర్‌ను శివశంకర్ రెడ్డి (Shiva Shankar Reddy) కుమారుడు చైతన్యరెడ్డి (Chaithanya Reddy) బెదిరించాడని సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Siddhartha Luthra) కోర్టుకు విన్నవించారు. అదేవిధంగా కేసులో డాక్టర్ చైతన్య, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చాలని ఆయన కోరారు. ఈ క్రమంలోనే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy), శివశంకర్ రెడ్డి (Shiva Shankar Reddy) కొడుకు చైతన్యరెడ్డి (Chaithanya Reddy)కి సుప్రీం కోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 3కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
అదేవిధంగా తమపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ.. సునీతారెడ్డి (Sunitha Reddy), సీబీఐ అధికారి రాంసింగ్ (CBI Office Ram Singh), నర్రెడ్డి రాజశేఖరరెడ్డి (Narreddy Rajashekar Reddy) దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. వివేకా హత్య కేసులో జరిగిన పరిణామాలను సిద్దార్ధ లూథ్ర (Siddhartha Luthra) కోర్టుకు క్షుణ్ణంగా వివరించారు. ఎంక్వైరీ ఆఫీసర్‌పై ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా ఎంక్వైరీని అడ్డుకున్నారని వాదనలు బలంగా వినిపించారు. కేసులో సాక్ష్యాధారాలను మాయం చేయాలని చూశారని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తు సాగుతోందని వాటిని దృష్టిలో పెట్టుకుని లేనిపోని ఆరోపణలతో ప్రైవేటు ఫిర్యాదు చేశారని కోర్టుకు లూథ్రా అన్నారు. ఇరు పక్షాల వాదోపవాదాలు విన్న చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2015 ఫిబ్రవరి 24కు వాయిదా వేసింది.