All Party Meeting: పార్లమెంట్ ముందుకు కీలక బిల్లులు.. ఈ నెల 24న ఆల్ పార్టీ మీటింగ్

పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ ను నిర్వహించబోతున్నది.

Update: 2024-11-19 07:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ శీతాకాల సమావేశాల (Parliament Winter Session) నేపథ్యంలో ఈ నెల 24న కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష (All Party Meeting) సమావేశం నిర్వహించబోతున్నది. ఈ విషయాన్ని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) మంగళవారం ప్రకటించారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్న పార్లమెంట్ వింటర్ సెషన్స్ లో 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' (One Nation One Election),  వక్ఫ్ (సవరణ) బిల్లు-2024 వంటి కీలక బిల్లులు పార్లమెంట్ కు రాబోతున్నాయనే చర్చ జరుగుతున్నది. వీటితో పాటు మరికొన్ని ముఖ్యమైన అంశాలపై సభలో అధికార, విపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరగవచ్చని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్వహించబోతున్న అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు ఎలాంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచనున్నది అనేది ఆసక్తిగా మారింది. అలాగే రాజ్యాంగం ఆమోదం పొందిన 75వ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ 26న పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో రాజ్యాంగ దినోత్సవం వేడుకలను ప్రభుత్వం నిర్వహించనుంది.

Tags:    

Similar News