మరోసారి దాడులు చేస్తే విధులకు దూరం

దిశ, ఆదిలాబాద్ కరోనా నివారణకు పోరాడుతున్న వైద్యులపై మరోసారి దాడులు జరిగితే విధులు బహిష్కరిస్తామని వైద్య సంఘాలు హెచ్చరించాయి.  గాంధీ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందిపై జరిగిన దాడిని నిర్మల్ జిల్లా ప్రభుత్వ వైద్యులు, పారామెడికల్ ఉద్యోగులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్,నిర్మల్ వైద్యుల సంఘం, ఇతర సంఘాలన్నీ తీవ్రంగా ఖండించాయి. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలు చేస్తుంటే ఇలాంటి దాడులు జరగడం బాధాకరమన్నారు. ఆపద కాలంలో సిబ్బందికి, వైద్యులకు రక్షణ లేకపోతే నిధులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. […]

Update: 2020-04-02 02:09 GMT

దిశ, ఆదిలాబాద్

కరోనా నివారణకు పోరాడుతున్న వైద్యులపై మరోసారి దాడులు జరిగితే విధులు బహిష్కరిస్తామని వైద్య సంఘాలు హెచ్చరించాయి. గాంధీ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందిపై జరిగిన దాడిని నిర్మల్ జిల్లా ప్రభుత్వ వైద్యులు, పారామెడికల్ ఉద్యోగులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్,నిర్మల్ వైద్యుల సంఘం, ఇతర సంఘాలన్నీ తీవ్రంగా ఖండించాయి. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలు చేస్తుంటే ఇలాంటి దాడులు జరగడం బాధాకరమన్నారు. ఆపద కాలంలో సిబ్బందికి, వైద్యులకు రక్షణ లేకపోతే నిధులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. సేవలందించే వైద్యులకు తక్షణమే రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఖండించిన వారిలో నిర్మల్ జిల్లాలోని వైద్యసంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Tags: nirmal,Gandhi’s medical staff,Attack on doctors,Denied

Tags:    

Similar News