ఆర్ఎఫ్ సీఎల్ ఉద్యోగాల మాఫియా పై సీబీఐ కి ఫిర్యాదు…

దిశ,గోదావరిఖని : రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్ సీఎల్) లో ఉద్యోగాల రిక్రూట్మెంట్ కు సంబంధించి జరుగుతోన్న అవినీతి అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని రీజినల్ కమిషనర్ ను కలిసినట్లు సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు మద్దెల దినేష్, సల్ల రవీందర్ లు తెలిపారు. బుధవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రీజినల్ కమిషనర్ హైదరాబాద్ ఎస్పీ కళ్యాణ్ కి మెమొరాండంను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ […]

Update: 2021-11-24 04:02 GMT

దిశ,గోదావరిఖని : రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్ సీఎల్) లో ఉద్యోగాల రిక్రూట్మెంట్ కు సంబంధించి జరుగుతోన్న అవినీతి అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని రీజినల్ కమిషనర్ ను కలిసినట్లు సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు మద్దెల దినేష్, సల్ల రవీందర్ లు తెలిపారు. బుధవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రీజినల్ కమిషనర్ హైదరాబాద్ ఎస్పీ కళ్యాణ్ కి మెమొరాండంను అందజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఆర్ఎఫ్ సీఎల్ లో మొదటి నుంచి జరుగుతోన్న అవినీతి అక్రమ ఉద్యోగ రిక్రూట్మెంట్ లపై వస్తోన్న ఆరోపణలపై నిజ నిర్ధారణ చేసి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు. రిక్రూట్మెంట్ కు బాధ్యులైన కాంట్రాక్టర్లపై, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులపై విచారణ చేసి వారిని ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేయాలని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ 2015 సంవత్సరం పబ్లిక్ హియరింగ్ ప్రజాభిప్రాయ సేకరణలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రభావిత గ్రామాలకు, భూ నిర్వాసితులకు, ఎఫ్ సీఐ మాజీ కార్మికులకు, స్థానిక నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే పునర్నిర్మాణంలో పనిచేసిన స్థానికులను పర్మినెంట్ చేయాలని అన్నారు.

Tags:    

Similar News