ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవం కోసం టీఆర్ఎస్ రౌడీయిజం..!
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్లిన వ్యక్తులను అధికార టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ప్రెసిడెంట్ చింపుల సత్యనారాయణ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఎన్నికల చీఫ్ ఆఫీసర్, రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారికి టీఆర్ఎస్ పార్టీ వ్యవహారంపై ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ రౌడీయిజం, దౌర్జన్యంతో నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ […]
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్లిన వ్యక్తులను అధికార టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ప్రెసిడెంట్ చింపుల సత్యనారాయణ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఎన్నికల చీఫ్ ఆఫీసర్, రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారికి టీఆర్ఎస్ పార్టీ వ్యవహారంపై ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ రౌడీయిజం, దౌర్జన్యంతో నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నికల్లో నిబంధనల ప్రకారం నామినేషన్ వేసే హక్కు అందరికీ ఉంటుందన్నారు. ఆ హక్కును హరించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల రీ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలు చింపుల శైలజ, తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పసులూరి అశోక్ రావు, దేశమొల్ల అంజన్న, మందిపల్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.