కాబోయే దంపతులు కత్రినా-విక్కీ కౌశల్‌పై కేసు.. 

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్స్ కత్రీనా – విక్కీ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు కొంతకాలంగా చర్చ జరుగుతోంది. రాజస్థాన్‌లో జరగనున్న పెళ్లికి విక్కీ-క్యాట్ ఫ్యామిలీస్ సోమవారం ముంబై నుంచి బయలుదేరినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ జంటపై కేసు నమోదు కావడంతో ఫ్యాన్స్ షాక్‌ అవుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. ఈ జంట పెళ్లి చేసుకునే స్థలం రాజస్థాన్‌లోని బర్వార కోటకు వెళ్లే దారిలో ప్రముఖ దేవాలయం చౌత్ మాత మందిర్ ఉంది. అయితే […]

Update: 2021-12-07 01:19 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్స్ కత్రీనా – విక్కీ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు కొంతకాలంగా చర్చ జరుగుతోంది. రాజస్థాన్‌లో జరగనున్న పెళ్లికి విక్కీ-క్యాట్ ఫ్యామిలీస్ సోమవారం ముంబై నుంచి బయలుదేరినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ జంటపై కేసు నమోదు కావడంతో ఫ్యాన్స్ షాక్‌ అవుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. ఈ జంట పెళ్లి చేసుకునే స్థలం రాజస్థాన్‌లోని బర్వార కోటకు వెళ్లే దారిలో ప్రముఖ దేవాలయం చౌత్ మాత మందిర్ ఉంది.

అయితే ప్రతిరోజు అక్కడికి కొన్ని వేలమంది భక్తులు వచ్చి పోతుంటారు. కానీ కత్రినా-విక్కీ పెళ్లికి సెక్యూరిటీ కారణంతో ఆ మందిరానికి వెళ్లే దారిని పూర్తిగా మూసివేశారు. దీంతో ఆ గుడికి వెళ్లే భక్తులు మూసేసిన గుడి దారి తెరవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు కాబోయే దంపతుల పై కేసు కూడా ఫైల్ చేయించారు. ఈ ఇష్యూకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌ కాగా.. అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక విక్కీ-క్యాట్ మ్యారేజ్‌కు ఈ ప్రాంతానికి చెందిన జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

హీరోల మధ్య చిచ్చుపెడుతున్న పూజా హెగ్డే.. ఆ హీరో అభిమానులు ఫైర్

Tags:    

Similar News