భద్రాద్రి ఎస్పీపై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు
దిశ, ఖమ్మం: దొంగ పట్టాలు ఉపయోగించి తన భూమిని ఆక్రమించుకుంటున్న వ్యక్తికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునిల్ దత్ సహకరిస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు సోమవారం దేవాదాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. గత 70 ఏళ్లుగా తమ కుటుంబీకులు ఆ భూమిపైనే ఆధారపడి బతుకుతున్నామని, నాగరాజు అనే వ్యక్తి దొంగ పాస్‌బుక్‌తో భూమిని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయం చేయాల్సిన పోలీసులు అక్రమార్కుడికి అండగా నిలుస్తున్నారని పేర్కొంటూ ఎస్పీ సునిల్ […]
దిశ, ఖమ్మం: దొంగ పట్టాలు ఉపయోగించి తన భూమిని ఆక్రమించుకుంటున్న వ్యక్తికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునిల్ దత్ సహకరిస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు సోమవారం దేవాదాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. గత 70 ఏళ్లుగా తమ కుటుంబీకులు ఆ భూమిపైనే ఆధారపడి బతుకుతున్నామని, నాగరాజు అనే వ్యక్తి దొంగ పాస్‌బుక్‌తో భూమిని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయం చేయాల్సిన పోలీసులు అక్రమార్కుడికి అండగా నిలుస్తున్నారని పేర్కొంటూ ఎస్పీ సునిల్ దత్, ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దేవాదాస్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రెవెన్యూ డివిజనల్ అధికారి దీనిపై విచారణ చేపట్టి తగు నివేదిక సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది.