శాశ్వత వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే హెచ్ఆర్ఏ వదులుకోవాల్సిందే!?
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ సాధారణ పని విధానంగా మారిపోయింది. ఈ క్రమంలో ఎవరైన శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటే తమ వేతనం నుంచి హౌస్ రెంట్ అలవెన్స్(హెచ్ఆర్ఏ)ను కోల్పోవాల్సి రావొచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఉద్యోగి మౌలిక వేతన స్వరూపంలో మార్పులు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగి హెచ్ఆర్ఏను కొంత తగ్గించడం లేదంటే పూర్తిగా తీసేందుకు కంపెనీలకు అనుమతిచ్చే అవకాశం ఉంది. […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ సాధారణ పని విధానంగా మారిపోయింది. ఈ క్రమంలో ఎవరైన శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటే తమ వేతనం నుంచి హౌస్ రెంట్ అలవెన్స్(హెచ్ఆర్ఏ)ను కోల్పోవాల్సి రావొచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఉద్యోగి మౌలిక వేతన స్వరూపంలో మార్పులు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగి హెచ్ఆర్ఏను కొంత తగ్గించడం లేదంటే పూర్తిగా తీసేందుకు కంపెనీలకు అనుమతిచ్చే అవకాశం ఉంది.
కరోనా వల్ల చాలావరకు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. వచ్చే ఏడాది రమ్మని పిలిచినప్పటికీ ఈ మధ్య మళ్లీ కొత్త వేరియంట్ తిరిగి విజృంభించడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించాయి. ఈ క్రమంలోనే కొందరికీ శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తున్నాయి. దీనికి ఉద్యోగుల నుంచి కూడా సంతోషమే వ్యక్తమవుతోంది. అయితే, మారుతున్న పని విధానానికి తగినట్టుగా వేతన స్వరూపాన్ని మార్చడంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఉద్యోగులకు, కంపెనీలకు ఇబ్బందుల్లేని మార్పులు చేయాలని భావిస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఉద్యోగులు మౌలిక సదుపాయాలు, ఇంటర్నెట్, కంప్యూటర్, కరెంట్ లాంటి ఖర్చులను చెల్లించుకోవాల్సి వస్తోంది. దీన్ని కంపెనీ నుంచి అందేలా చూసే అవకాశం ఉంది. అలాగే, సొంత ఊర్లో నివశిస్తే ఇంటి అద్దె లాంటివి తొలగించవచ్చని సమాచారం. వీటితో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని మార్పులు తీసుకోవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.