పోర్నోగ్రఫీ కేసులోకి ఫ్యామిలీ మ్యాన్‌ను లాగిన కమెడియన్

దిశ, సినిమా : బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రా పోర్నోగ్రఫిక్ కేసు వారం నుంచి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఈ విషయంపై పలువురు నోరు విప్పుతుండగా.. తాజాగా కమెడియన్ సునీల్ పాల్ కూడా ఆ లిస్టులో చేరిపోయారు. రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ రాకెట్‌ను ఛేదించిన పోలీసులను అభినందించాడు. సెన్సార్‌షిప్ లేకపోవడం వల్ల వెబ్‌ సిరీస్‌లు లేదా ఇతర ప్లాట్‌ఫామ్స్‌ పట్ల పెద్దస్థాయి వ్యక్తులు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని చెప్పాడు. ప్రస్తుతం రూపొందుతున్న సిరీస్‌లను ఫ్యామిలీతో […]

Update: 2021-07-26 06:48 GMT

దిశ, సినిమా : బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రా పోర్నోగ్రఫిక్ కేసు వారం నుంచి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఈ విషయంపై పలువురు నోరు విప్పుతుండగా.. తాజాగా కమెడియన్ సునీల్ పాల్ కూడా ఆ లిస్టులో చేరిపోయారు. రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ రాకెట్‌ను ఛేదించిన పోలీసులను అభినందించాడు. సెన్సార్‌షిప్ లేకపోవడం వల్ల వెబ్‌ సిరీస్‌లు లేదా ఇతర ప్లాట్‌ఫామ్స్‌ పట్ల పెద్దస్థాయి వ్యక్తులు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని చెప్పాడు. ప్రస్తుతం రూపొందుతున్న సిరీస్‌లను ఫ్యామిలీతో చూసే పరిస్థితి లేదంటూ ఈ వివాదంలోకి మనోజ్ బాజ్‌పాయ్‌ను లాగాడు. అతనితో పాటు మరో నలుగురు వ్యక్తులంటే ఇష్టం లేదని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. మనోజ్ బాజ్‌పాయ్ వంటి బడా యాక్టర్‌ను ఇలాంటి రోల్‌లో ఎప్పుడూ చూడలేదని, తను దిగజారిపోయాడని విమర్శించాడు. ఈ దేశం తనకు ప్రెసిడెంట్ అవార్డిస్తే, ఫ్యామిలీ ఆడియన్స్‌కు చేస్తున్నదేంటని? ప్రశ్నించాడు.

‘వైఫ్‌కు మరొకరితో ఎఫైర్, నీకు ఇంకెక్కడో ఎఫైర్, బాయ్‌ఫ్రెండ్ గురించి మాట్లాడే మైనర్ డాటర్, వయసుకు మించి ప్రవర్తించే చిన్న కొడుకు’.. ఇలాంటి క్యారెక్టర్స్‌‌తో వెబ్ సిరీస్‌తో ఏంటని? ఇలాంటి ఫ్యామిలీ ఉంటుందా? అని అడిగాడు. ఇదే క్రమంలో.. రాజ్ అండ్ డీకే ‘దిఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌తో పాటు అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, శ్వేత త్రిపాఠిల ‘మీర్జాపూర్’ సిరీస్‌ పైనా విమర్శలు గుప్పించారు. ఇలాంటి వాటిని పోర్న్‌గా పరిగణించి బ్యాన్ చేయాలన్న పాల్.. కంటెంట్‌‌ను బట్టి అది పోర్న్‌ అవునా? కాదా? అనే విషయం పక్కనబెడితే, అలాంటి ఆలోచనలు రేకెత్తించేది కూడా పోర్న్ కిందే లెక్క అని పేర్కొన్నాడు.

Tags:    

Similar News