అధికార దుర్వినియోగం.. సర్పంచ్ సస్పెన్షన్
దిశ, మహబూబ్‌నగర్: అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ఓ సర్పంచ్ సస్పెండ్ అయ్యారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం టంకర గ్రామ పంచాయతీలో జరిగింది. ఆ గ్రామ సర్పంచ్ మొండే అచ్చన్నను సస్పెండ్ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు ఉత్తర్వులు జారీ చేశారు. అచ్చన్న తన సొంత పొలంలో నాలా అనుమతి లేకుండా, గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా అక్రమలే అవుట్ ఏర్పాటు చేశాడు. అతనిపై నిబంధనలకు విరుద్ధంగా అమ్ముకున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. […]
దిశ, మహబూబ్‌నగర్: అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ఓ సర్పంచ్ సస్పెండ్ అయ్యారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం టంకర గ్రామ పంచాయతీలో జరిగింది. ఆ గ్రామ సర్పంచ్ మొండే అచ్చన్నను సస్పెండ్ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు ఉత్తర్వులు జారీ చేశారు. అచ్చన్న తన సొంత పొలంలో నాలా అనుమతి లేకుండా, గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా అక్రమలే అవుట్ ఏర్పాటు చేశాడు. అతనిపై నిబంధనలకు విరుద్ధంగా అమ్ముకున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. నాలా అనుమతి లేకుండా చేసిన వెంచర్ యజమానికి వ్యక్తిగతంగా సహకరించి గ్రామపంచాయతీకి రావాల్సిన టాక్స్ రాకుండా చేశాడు. గ్రామ పంచాయతీకి సంబంధించిన కుమ్మరి గెరి బోరు నీటిని తన సొంత వ్యవసాయ భూమికి వాడుకున్నాడు. ప్రభుత్వానికి సంబంధించిన ఎకరం ఒక గుంట భూమిని కబ్జా చేశాడు. ప్రభుత్వ ట్రాక్టర్, ట్యాంకర్లను తన సొంత అవసరాలకు వాడుకోవడం, హరితహారం కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయటం, ప్రైవేటు వ్యక్తులకు కిరాయికి ఇవ్వటం వంటి పనులు చేశాడు. గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పెద్ద చెరువు మట్టిని ట్రిప్పు లెక్కన డబ్బులకు అమ్ముకున్నాడు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా గ్రామంలో కొత్త ఇళ్ల నిర్మాణాలకు లోపాయికారి ఒప్పందంతో సహకరించి గ్రామ పంచాయతీకి రావలసిన ట్యాక్స్‌ను దారి మళ్ళించాడు. ఉపాధి హామీ పథకంలో మంజూరైన స్మశానవాటికలో నిబంధనలకు విరుద్ధంగా కూలీలకు పని కల్పించకుండా మిషన్లతో పని చేయించి కూలీలకు పని లేకుండా చేశాడు. అన్ని అభియోగాలను ప్రాథమిక ఆధారాలను దృష్టిలో ఉంచుకొని వీటన్నింటిపై దర్యాప్తులో ఉంచి తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 37(5)ప్రకారం తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు సర్పంచ్ బాధ్యతల నుంచి మెండే అచ్చన్నను సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు.
Tags: Collector, Sarpanch, suspended, mahabubnagar, Gram Panchayat, Personal requirements, Panchayati Raj Act