కరోనా వ్యాప్తి నివారణకు వచ్చే 15 రోజులు కీలకం
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాబోయే 15 రోజులు చాలా కీలకమని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. కోటగిరి మండలం పోతంగల్‌లోని మహారాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టును మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గినా వైరస్‌ను అరికట్టేందుకు రాబోయే 15 రోజులు చాలా ముఖ్యమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎవరూ జిల్లాలోకి రాకుండా చూస్తే […]
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాబోయే 15 రోజులు చాలా కీలకమని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. కోటగిరి మండలం పోతంగల్‌లోని మహారాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టును మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గినా వైరస్‌ను అరికట్టేందుకు రాబోయే 15 రోజులు చాలా ముఖ్యమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎవరూ జిల్లాలోకి రాకుండా చూస్తే కరోనా పూర్తిగా తగ్గే అవకాశం ఉందని చెప్పారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ చేయాలని వైద్యులను కోరారు. అనుమానం వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలించాలని సూచించారు. అలసత్వం వహిస్తే వర్షాకాలంలో కరోనా ప్రభావం మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని సూచించారు. డెలివరీ కేసులపై కూడా వైద్యులు దృష్టి సారించాలన్నారు. గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించాలని, హైరిస్క్ కేసులు ఉంటే వారిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని కోరారు.
Tags: Nizamabad, collector Narayana Reddy, pothangal checkpost, Inspected