ఆదివాసీల అభివృద్ధికి నేనున్నాను: కలెక్టర్ ఎంవీ రెడ్డి
దిశ, ఖమ్మం: అభివృద్ధికి ఆమడదూరంలో బతుకుతున్న ఆదివాసీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి భరోసా నింపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి బాట పట్టాలని వారికి సూచించారు. జిల్లాలోని చుంచుపల్లి మండలం పెనుగడప గ్రామ పంచాయతీ పరిధిలోని తండాలను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆదివాసీలతో కలెక్టర్ నేలపైనే కూర్చొని ముచ్చటించారు. వారికున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా తండాలో నీటి సమస్య ఎదుర్కొంటున్నామని తండావాసులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కిలోమీటర్ దూరంలోని […]
దిశ, ఖమ్మం: అభివృద్ధికి ఆమడదూరంలో బతుకుతున్న ఆదివాసీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి భరోసా నింపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి బాట పట్టాలని వారికి సూచించారు. జిల్లాలోని చుంచుపల్లి మండలం పెనుగడప గ్రామ పంచాయతీ పరిధిలోని తండాలను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆదివాసీలతో కలెక్టర్ నేలపైనే కూర్చొని ముచ్చటించారు. వారికున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా తండాలో నీటి సమస్య ఎదుర్కొంటున్నామని తండావాసులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కిలోమీటర్ దూరంలోని వాగుకెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోందని చెప్పారు. దీంతో శాశ్వత పరిష్కారం చేపడతామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. చాలామందికి రేషన్, ఆధార్ లేదని గుర్తించిన కలెక్టర్ వెంటనే వారికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ మంజూరుకు ప్రతిపాదనలు తయారు చేయాలని, ఉపాధి కల్పనకు జాబ్ కార్డులు జారీ చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అవకాశం లేని నేపథ్యంలో ప్రత్యేకంగా సోలార్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తామని ఆదివాసీలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భవాని, ఎంపీడీవో రమేష్, ఆర్డీవో స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
Tags: Collector MV Reddy, Adivasi, Meeting, Bhadradri kothagudem