యువత ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెంచండి : కలెక్టర్ కర్ణన్
దిశ, కరీంనగర్ సిటీ : నిత్య వ్యాయామంతోనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితమవుతుందని, ప్రతీ వ్యక్తి రోజుకో అరగంట పాటు వ్యాయామం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్‌ను శనివారం స్థానిక డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో, సీపీ సత్యనారాయణతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ.. యువత ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నేటి […]
దిశ, కరీంనగర్ సిటీ : నిత్య వ్యాయామంతోనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితమవుతుందని, ప్రతీ వ్యక్తి రోజుకో అరగంట పాటు వ్యాయామం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్‌ను శనివారం స్థానిక డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో, సీపీ సత్యనారాయణతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ.. యువత ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నేటి యువత శారీరక శ్రమ ఉన్న రన్నింగ్, జాగింగ్, క్రీడలు ఆడడం లేదని, మొబైల్ ఫోన్లోని పబ్జీ లాంటి మొబైల్ క్రీడలకు బానిసలుగా మారారని, ఇది మానుకోవాలని యువతను కోరారు. అవసరానికే మొబైల్ ఫోన్ వినియోగించుకోవాలని సూచించారు. ప్రతినిత్యం అరగంట పాటు స్పోర్ట్స్ లేదా యోగ, శారీరక వ్యాయామం కోసం సమయం కేటాయించాలని తెలిపారు. పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ, యువత జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఆరోగ్యంపై ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ, నిత్యజీవితంలో ప్రతీ ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారని, ఒత్తిడిని తగ్గించుకునేందుకు శారీరక వ్యాయామం దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, క్యాడెట్, యువతతో ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్సీసీ క్యాడేట్స్, డిగ్రీ విద్యార్థులు, యువతీ యువకులు, క్రీడాకారులతో అంబేద్కర్ స్టేడియం నుంచి ప్రారంభమైన 2కె రన్.. భగత్ నగర్, కలెక్టరేట్ మీదుగా తెలంగాణ చౌక్ వద్ద ముగిసింది.
ఈ 2కె రన్లో డీవైఎస్ఒ కే. రాజావీర్, నెహ్రూ యువ కేంద్ర కో-ఆర్డినేటర్ రాంబాబు, ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి జి. జనార్ధన్ రెడ్డి, తుమ్మల రమేష్ రెడ్డి, ప్రభుత్వ ఎస్.ఆర్.ఆర్, ప్రభుత్వ మహిళ డిగ్రీ, పీజీ కళాశాలల, వివేకానంద డిగ్రీ పీజీ కళాశాల ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అధికారులు బాలరాజు, కెప్టెన్ కిరణ్ జ్యోతి, డాక్టర్ రజనీ దేవి, బి. సురేష్ కుమార్, వి. వరప్రసాద్ నాయుడు, ఏ. నారాయణ, యువజన అవార్డు గ్రహీతలు కే. కిరణ్ కుమార్, కొండ రవి యాదవ్, సత్తి నేని శ్రీనివాస్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.