ఉపాధ్యాయుడు కామరాజుపై కలెక్టర్ సీరియస్.. విచారణకు ఆదేశాలు..

దిశ, వెంకటాపురం : బర్లగూడెం గ్రామపంచాయతీలోని చిరుతపల్లి మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు కామరాజు మద్యం సేవించి, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని పలు పత్రికల్లో వచ్చిన వార్తలపై ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య స్పందించారు. ఈ విషయంపై కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ నాగరాజు, చిరుతపల్లి క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు ఆనందరావు బుధవారం విచారణ చేపట్టారు. గత రెండేళ్లుగా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని అధికారులు పేర్కొన్నారు. ఏటూరునాగారం డీటీడీఓ అదేశాల మేరకు ఉపాధ్యాయుడు […]

Update: 2021-09-08 07:59 GMT

దిశ, వెంకటాపురం : బర్లగూడెం గ్రామపంచాయతీలోని చిరుతపల్లి మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు కామరాజు మద్యం సేవించి, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని పలు పత్రికల్లో వచ్చిన వార్తలపై ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య స్పందించారు. ఈ విషయంపై కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ నాగరాజు, చిరుతపల్లి క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు ఆనందరావు బుధవారం విచారణ చేపట్టారు.

గత రెండేళ్లుగా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని అధికారులు పేర్కొన్నారు. ఏటూరునాగారం డీటీడీఓ అదేశాల మేరకు ఉపాధ్యాయుడు కామరాజు ను ఐటీడీఏకు సరెండర్ చేసినట్లు తెలిపారు. చిరుతపల్లి మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడిగా సునీల్‌ను నియమించినట్లు వెల్లడించారు.

Tags:    

Similar News