NTR: అభిమాని కోసం అన్ని ఏర్పాట్లు చేసిన "ఎన్టీఆర్"
క్యాన్సర్(Cancer) వ్యాధితో బాధపడుతున్న జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) అభిమాని కౌశిక్(Koushik) గురించి అందరికీ తెలుసు.
దిశ, వెబ్‌డెస్క్: క్యాన్సర్(Cancer) వ్యాధితో బాధపడుతున్న జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) అభిమాని కౌశిక్(Koushik) గురించి అందరికీ తెలుసు. తాను చనిపోయేలోపు ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమా చూడాలని చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. కొన్నిరోజుల పాటు అతని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు.. బాలుడి అనారోగ్యం గురించి తెలిసి ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి మరీ మాట్లాడి ధైర్యం చెప్పారు. తాజగా.. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన బాలుడు కౌశిక్ డిశ్చార్జి అయ్యారు. ఈ విషయం తెలిసి తన టీమ్‌తో మాట్లాడి అభిమాని యోగక్షేమాలను ఎన్టీఆర్ తెలుసుకున్నారు. అనంతరం దగ్గరుండి తన టీమ్ చేత డిశ్చార్జ్ చేయించారు. కాగా, గతంలో బాలుడి వైద్య ఖర్చులు కూడా భరిస్తానని ఎన్టీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
చెన్నై
— TV5 News (@tv5newsnow) December 24, 2024
అభిమాని కోసం అన్ని ఏర్పాట్లు చేసిన "ఎన్టీఆర్".
క్యాన్సర్ తో బాధపడుతూ చెన్నై అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ను ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు.
విషయం తెలుసుకోకుండా నిన్నటి నుంచి సోషల్ మీడియా, కొన్ని చానల్స్ లో ఎన్టీఆర్ నీ నిందిస్తూ… pic.twitter.com/vIfeGY0W32