DJ మాటున మామూళ్ల దందా.. పోలీసుల చేయి తడిపితే చాలు..

దిశ, సిరిసిల్ల : అధిక శబ్దాన్ని ఉత్పత్తి చేసి గుండెకు దడ తెప్పించే డిస్క్ జాకీ(డీజే)లకు అనుమతి లేదని ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. దానిని అమలు చేయాలని జిల్లా పోలీస్ బాస్ మొన్నటికి మొన్న వినాయకచవితి సందర్భంగా జిల్లాలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌లను ఆదేశించారు. అయినప్పటికీ ఎక్కడా కూడా డీజేల వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. డీజేల నిర్వాహకులు ఇచ్చే డబ్బులకు తలొగ్గి పోలీసు ఉన్నతాధికారి ఆదేశాలను బేఖాతరు […]

Update: 2021-09-16 03:17 GMT

దిశ, సిరిసిల్ల : అధిక శబ్దాన్ని ఉత్పత్తి చేసి గుండెకు దడ తెప్పించే డిస్క్ జాకీ(డీజే)లకు అనుమతి లేదని ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. దానిని అమలు చేయాలని జిల్లా పోలీస్ బాస్ మొన్నటికి మొన్న వినాయకచవితి సందర్భంగా జిల్లాలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌లను ఆదేశించారు. అయినప్పటికీ ఎక్కడా కూడా డీజేల వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. డీజేల నిర్వాహకులు ఇచ్చే డబ్బులకు తలొగ్గి పోలీసు ఉన్నతాధికారి ఆదేశాలను బేఖాతరు చేస్తున్న విధానం సిరిసిల్ల జిల్లాలో కనబడుతోంది.

సాధారణ రోజుల్లోనూ..

ఏడాదికి ఒకసారి వచ్చే బతుకమ్మ, వినాయక చవితి లాంటి ప్రత్యేక సందర్భాల్లోనే కాకుండా సాధారణ రోజుల్లో డీజేల వినియోగం విరివిరిగా కనబడుతోంది. జిల్లాలోని ప్రతీ కల్యాణ మండపానికి అనుబంధంగా డీజే సమకూర్చే వ్యక్తులున్నారు. ఈ విధానాన్ని అడ్డుకోకుండా ఏడాదికి, ఆరు నెలలకోసారి ఆయా కళ్యాణ మండపాల పరిధిలోని పోలీస్ అధికారులకు మామూళ్లు ఇచ్చే సంస్కృతి ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందుకే ఇష్టారాజ్యంగా గంటల తరబడి సామాన్య జనాలు నిద్రించే సమయానికి కూడా కలవరపెట్టే డీజే సౌండ్‌తో నిర్వాహకులు రెచ్చిపోతున్నారు.

ఏడాదికి మామూళ్ల లీజు..

డీజే నిర్వాహకుల నుండి పోలీస్ స్టేషన్ అధికారి నేరుగా డబ్బులు తీసుకోకుండా మండల స్థాయిలో అయితే విలేజ్ పోలీస్ ఆఫీసర్ పట్టణాల్లో అయితే ఐడి పార్టీ కానిస్టేబుల్స్ భేషరతుగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు బహిరంగ చర్చ జరుగుతోంది. వీటన్నింటిని నెలాఖరు తేదీన ముట్ట చెప్పే సంస్కృతి కొనసాగుతోంది. ఒక్కో డీజే నిర్వాహకుల వద్ద నెలకు కనీసం ఐదు వేల నుండి గరిష్టంగా 30 వేల రూపాయలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలోని 13 మండలాల్లో ప్రతీ మండలానికి కనీసం 2 డీజేలు ఉన్నట్లు గణాంకాలు ఉన్నాయి. ప్రస్తుతం వినాయక మండపాలకు 5,000 చొప్పున లక్షల్లో డీజే డబ్బుల లావాదేవీలు సాగినట్లు చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News