సెల్ ఫోన్ షాపుల్లో వడ్డీల దందా.. ఫైనాన్స్ పేరుతో భారీ దోపిడీ..
దిశ, మణుగూరు : ప్రతీ మనిషికి టచ్ ఫోన్ అంటే అదొక కొత్త ప్రపంచం. ఆ ప్రపంచంలోనే ప్రతీ ఒక్కరు మునిగి తేలుతూ సంతోషంగా గడుపుతున్నారు. కొత్త ఫోన్ కొన్న ఆనందంలో మెసేజ్ వచ్చిందని, కాల్ వచ్చిందని కొంత మంది మురిసిపోతుంటారు. ఈ నేపథ్యంలో టచ్ ఫోన్ ప్రజలకు చాలా అవసరమని గమనించి ప్రజల దగ్గర నుంచి వేలకు వేలు వసూల్ చేస్తూ కొందరు వ్యాపారులు ప్రజలను పీక్కుతింటున్నారు. వివరాల్లోకి వెళ్ళితే.. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలంలో […]
దిశ, మణుగూరు : ప్రతీ మనిషికి టచ్ ఫోన్ అంటే అదొక కొత్త ప్రపంచం. ఆ ప్రపంచంలోనే ప్రతీ ఒక్కరు మునిగి తేలుతూ సంతోషంగా గడుపుతున్నారు. కొత్త ఫోన్ కొన్న ఆనందంలో మెసేజ్ వచ్చిందని, కాల్ వచ్చిందని కొంత మంది మురిసిపోతుంటారు. ఈ నేపథ్యంలో టచ్ ఫోన్ ప్రజలకు చాలా అవసరమని గమనించి ప్రజల దగ్గర నుంచి వేలకు వేలు వసూల్ చేస్తూ కొందరు వ్యాపారులు ప్రజలను పీక్కుతింటున్నారు.
వివరాల్లోకి వెళ్ళితే.. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలంలో ఒక సెల్ ఫోన్ షాప్ భారీగా వడ్డీల వసూళ్లకు పాల్పడుతున్నదని ప్రజలు ఆరోపిస్తున్నారు. 30వేల సెల్ ఫోన్ ఈ షాప్‌లో తీసుకుంటే దానిలో సగం డబ్బులు ముందు కట్టించుకొని మిగతా డబ్బులు ఫైన్స్ అని చెప్పి అమాయక ప్రజల దగ్గర నుంచి డాక్యుమెంట్స్ పేరుతో 1000 రూపాయల వరకు వసూల్ చేసి దోచుకుంటున్నారని మండల ప్రజలు తెలుపుతున్నారు. ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సెల్ షాప్ దందాకు పాల్పడుతోందని సమాచారం.
అయితే కొత్త ఫోన్ కొన్న ఆనందంలో షాప్ వాళ్లు ఎంత వడ్డీ వేశారనేది, ఎంత కట్టాలి అనేది ఆలోచించకుండా కొందరు గుడ్డిగా సెల్ ఫోన్ కొంటున్నారు. ఈ క్రమంలో సెల్ షాపు వ్యాపారులు తమ లాభం కోసం ఈ సెల్ ఫోన్ బాగుంటది.. ఆ సెల్ ఫోన్ బాగుంటది అని ప్రజలను మభ్యపెట్టి అమాయకమైన ప్రజల దగ్గర నుంచి కొత్తఫోన్‌తో భారీగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కొత్త సెల్ ఫోన్ కొన్న పాపానికి డాక్యుమెంట్స్ ఛార్జీలు, నెల నెలా వడ్డీలు వేస్తూ అందులో భాగంగా నెల వడ్డీ కట్టకపోతే ఇంటి మీదకు వచ్చి సెల్ ఫోన్ లాక్కొని.. నానా ఇబ్బందులకు గురి చేస్తుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో షాప్ వాళ్ళు డబ్బులు వసూల్‌కు వచ్చినప్పుడు రవాణా చార్జీలు కూడా కూడా ప్రజలపై మోపుతూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారని ప్రజలు ముక్తకంఠంతో తెలుపుతున్నారు.
సెల్ ఫోన్ కొన్న పాపానికి ఫైనాన్స్‌తో పాటు నెలవడ్డీ, నెల దాటితే మరో వడ్డీ ఎలా కట్టాలి.. కట్టకపోతే ఇంటి మీదకు వచ్చి మహిళల ముందు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సెల్ షాప్ ఫైనాన్స్ పేరుతో ఇష్టం వచ్చినట్లుగా భారీగా దోచుకుంటున్నదని మండలంలోని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా ఈ సెల్ ఫోన్ షాపుపై దాడులు జరిపి.. వడ్డీల విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.