'జగనన్న విద్యా కానుకను ప్రారంభించిన జగన్.. బోర్డుపై ఏం రాశారంటే..?

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ‘జగనన్న విద్యా కానుక’ పథకాన్ని ప్రారంభించారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి  ప్రారంభించారు. అంతకుముందు పాఠశాల అభివృద్ధి పనులను సీఎం పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోని గ్రీన్‌ బోర్డుపై ‘ఆల్‌ ద వెరీ బె​స్ట్‌’ అని రాసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి తరగతి గదిలోకి వెళ్లి సీఎం జగన్‌ విద్యార్థులతో  ముచ్చటించారు. ప్రస్తుతం స్కూల్లో ఉన్న సౌకర్యాలపై విద్యార్థులను […]

Update: 2021-08-16 04:01 GMT

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ‘జగనన్న విద్యా కానుక’ పథకాన్ని ప్రారంభించారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అంతకుముందు పాఠశాల అభివృద్ధి పనులను సీఎం పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోని గ్రీన్‌ బోర్డుపై ‘ఆల్‌ ద వెరీ బె​స్ట్‌’ అని రాసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి తరగతి గదిలోకి వెళ్లి సీఎం జగన్‌ విద్యార్థులతో ముచ్చటించారు.

ప్రస్తుతం స్కూల్లో ఉన్న సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న స్కూల్‌ బ్యాగ్‌ను భుజనా వేసుకొని మరీ సీఎం జగన్‌ పరిశీలించారు. అలాగే విద్యార్థులకు అందించే భోజనానికి సంబంధించిన మెనూను సైతం సీఎం జగన్ పరిశీలించారు. ఆ తర్వాత ‘మనబడి నాడు-నేడు’ ద్వారా తొలి విడత పనులు పూర్తైన పాఠశాలలను పైలన్‌ ఆవిష్కరించి సీఎం జగన్‌ ప్రారంభించారు.

Tags:    

Similar News