చిత్తూరులో సీఎం వైఎస్ జగన్.. ఘన స్వాగతం పలికిన మంత్రులు
దిశ, రాయలసీమ: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడంతోపాటు రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 3.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం జగన్ అనంతరం సాయంత్రం తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం వైఎస్ జగన్‌తోపాటు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, సీఎం సెక్రటరీ ధనుంజయ్‌రెడ్డి, సీఎం అడిషనల్ పీఎస్ […]
దిశ, రాయలసీమ: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడంతోపాటు రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 3.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం జగన్ అనంతరం సాయంత్రం తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం వైఎస్ జగన్‌తోపాటు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, సీఎం సెక్రటరీ ధనుంజయ్‌రెడ్డి, సీఎం అడిషనల్ పీఎస్ కె.నాగేశ్వర్‌రెడ్డి ఉన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు విమానాశ్రయంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, డిప్యూటీ సీఎం కె.నారాయణ స్వామి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు ఎన్.రెడ్డెప్ప, ఎం.గురుమూర్తి, జడ్పీ చైర్మన్ జి.శ్రీనివాసులు, ఎమ్మెల్యే రోజాతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జగన్‌కు ఘన స్వాగతం పలికారు. వారితోపాటు స్వాగతం పలికిన వారిలో డీఐజీ క్రాంతి రాణా టాటా, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి మోహన్, జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయన్, చిత్తూరు, తిరుపతి ఎస్పీలు సెంథిల్ కుమార్, వెంకట అప్పలనాయుడు ఇతర అధికారులు ఉన్నారు.