వాటికి ఈ క్రాపింగ్ తప్పనిసరి: జగన్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం జగన్ పాల్గొన్నారు. కొవిడ్ సమయంలో నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నందుకు బ్యాంకర్లకు ధన్యవాదాలు తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ. 13,500 చెల్లించేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 2020-21 ఖరీఫ్‌లో రూ. 75.237 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యంగా.. ఇప్పటి వరకు రూ. 62,650 కోట్లు పంపిణీ చేసినట్టు సీఎం జగన్ తెలిపారు. పంటల బీమా, సున్నా వడ్డీ రుణాల కోసం […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం జగన్ పాల్గొన్నారు. కొవిడ్ సమయంలో నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నందుకు బ్యాంకర్లకు ధన్యవాదాలు తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ. 13,500 చెల్లించేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 2020-21 ఖరీఫ్‌లో రూ. 75.237 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యంగా.. ఇప్పటి వరకు రూ. 62,650 కోట్లు పంపిణీ చేసినట్టు సీఎం జగన్ తెలిపారు. పంటల బీమా, సున్నా వడ్డీ రుణాల కోసం ఈ క్రాపింగ్ తప్పనిసరి చేయాలన్నారు. వచ్చే నెలలోనే ఈ పథకాన్ని అమలుచేయబోతున్నట్టు జగన్ ప్రకటించారు. వైఎస్ చేయూత ద్వారా దాదాపు 25 లక్షల మంది మహిళలకు న్యాయం చేకూరుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.