సీఎం కీలక నిర్ణయం.. వైద్యులు, నర్సులకు రూ.30 వేల ఇన్సెంటివ్

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాప్తి చెందుతున్న నాటి నుంచి ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉన్న వైద్యులు విశ్రాంతి లేకుండా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. అయితే, కొందరు వైద్య సిబ్బంది కరోనా బారినపడి కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో పోరాడి చనిపోయిన 43 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్, ప్రభుత్వ ఆసుప్రతుల వైద్యుల కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. అంతే […]

Update: 2021-05-12 04:35 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాప్తి చెందుతున్న నాటి నుంచి ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉన్న వైద్యులు విశ్రాంతి లేకుండా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. అయితే, కొందరు వైద్య సిబ్బంది కరోనా బారినపడి కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో పోరాడి చనిపోయిన 43 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్, ప్రభుత్వ ఆసుప్రతుల వైద్యుల కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. అంతే కాకుండా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఫ్రంట్‌లైన్ సిబ్బంది అయిన వైద్యులకు రూ. 30వేలు, నర్సులకు రూ. 20వేలు, ఇతర కార్మికులకు రూ. 15 వేలు ఇన్సెంటివ్ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. పీజీ విద్యార్థులకు, ట్రైనీ వైద్యులకు ప్రోత్సాహకంగా రూ. 20వేల అందిస్తున్నట్టు తెలిపారు.

 

Tags:    

Similar News