సీఎం పదవి నుంచి ఆయన వైదొలగాలి….

దిశ, భద్రాచలం : ఏజెన్సీలో ప్రధానమైన 1/70 చట్టాన్ని రక్షించలేని కేసీఆర్ తక్షణమే ఆయన పదవికి రాజీనామా చేసి సీఎం పదవి నుంచి వైదొలగాలని ఏఎస్‌పి రాష్ట్ర కార్యదర్శి పాండ్రు హేమసుందర్ డిమాండ్ చేశారు. ఆదివాసీ వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి హేమ సుందర్ వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…..ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కి, కొత్త చట్టాలు తీసుకొచ్చి మన్యం ఆదివాసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అమాయక […]

Update: 2020-10-23 11:28 GMT

దిశ, భద్రాచలం :
ఏజెన్సీలో ప్రధానమైన 1/70 చట్టాన్ని రక్షించలేని కేసీఆర్ తక్షణమే ఆయన పదవికి రాజీనామా చేసి సీఎం పదవి నుంచి వైదొలగాలని ఏఎస్‌పి రాష్ట్ర కార్యదర్శి పాండ్రు హేమసుందర్ డిమాండ్ చేశారు. ఆదివాసీ వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి హేమ సుందర్ వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…..ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కి, కొత్త చట్టాలు తీసుకొచ్చి మన్యం ఆదివాసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అమాయక ఆదివాసీ బ్రతుకులతో తెలంగాణ ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆయన విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వ వైఖరి మారకుంటే ఉద్యమ రూపంలో ఆదివాసీలు చెలరేగి కేసీఆర్‌ను గద్దె దింపడం ఖాయమని అన్నారు.‌

Tags:    

Similar News