కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌తో కేసీఆర్ భేటీ
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రానికి రావాల్సిన నిధులు, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలపై చర్చించేందుకు శుక్రవారం సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్ర సహకారం సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ప్రతి రోజు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతులు మంజూరు […]
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రానికి రావాల్సిన నిధులు, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలపై చర్చించేందుకు శుక్రవారం సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్ర సహకారం సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ప్రతి రోజు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతులు మంజూరు చేయాలని కేసీఆర్ కేంద్రాన్ని కోరే అవకాశం ఉన్నట్టు సమాచారం. కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి అనంతరం మొదటిసారిగా ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ప్రధాని మోడీతో సహా ఇతర మంత్రులను కేసీఆర్ కలవబోతున్నారు.