మీకు శిరసు వంచి నమస్కరిస్తున్నా: సీఎం కేసీఆర్
దిశ, వెబ్ డెస్క్: కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ వరకు భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండపోచమ్మ జలశాయం ఒక అపూరపమైన ప్రాజెక్టు అని, కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన ఘట్టమని సీఎం కేసీఆర్ అన్నారు. భూనిర్వాసితుల త్యాగం వల్లే లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయని, వారి త్యాగం వెల కట్టలేనిదన్నారు. వారికి అన్ని విధాలా […]
దిశ, వెబ్ డెస్క్: కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ వరకు భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండపోచమ్మ జలశాయం ఒక అపూరపమైన ప్రాజెక్టు అని, కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన ఘట్టమని సీఎం కేసీఆర్ అన్నారు. భూనిర్వాసితుల త్యాగం వల్లే లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయని, వారి త్యాగం వెల కట్టలేనిదన్నారు. వారికి అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటదన్నారు. ఒకనాడు ఏడుపు పంటల తెలంగాణగా ఉండేదని.. నేడు పసిడి పంటల తెలంగాణగా మారిందని ఆయన అన్నారు.