‘హాస్పిటల్స్‌లో ఫైర్ ఇంజిన్లు.. హోంఐసోలేషన్‌లో కరోనా కిట్లు’

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దేశంలోని ఇప్పటికే పలు ఆస్పత్రుల్లో ఇటువంటి ప్రమాదాలు జరిగాయని.. అగ్నిమాపక సిబ్బందితో సమీక్షించుకొని తగు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం సూచించారన్నారు. ముఖ్యంగా గాంధీ, టిమ్స్‌ కొవిడ్ సెంటర్లలో పేషెంట్లు అధికంగా ఉన్నారని.. ఈ ఆస్పత్రుల్లో తప్పకుండా ఫైర్ ఇంజిన్లు ఉండేలా చర్యలు […]

Update: 2021-04-24 00:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దేశంలోని ఇప్పటికే పలు ఆస్పత్రుల్లో ఇటువంటి ప్రమాదాలు జరిగాయని.. అగ్నిమాపక సిబ్బందితో సమీక్షించుకొని తగు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం సూచించారన్నారు. ముఖ్యంగా గాంధీ, టిమ్స్‌ కొవిడ్ సెంటర్లలో పేషెంట్లు అధికంగా ఉన్నారని.. ఈ ఆస్పత్రుల్లో తప్పకుండా ఫైర్ ఇంజిన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారని ఈటల చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో కరోనా టెస్టులు కూడా భారీగా పెరుగుతున్న నేపథ్యంలోనే.. ప్రపంచంలో ఎక్కడి నుంచైన సరే కొవిడ్ నిర్ధారణ కిట్‌లను తెప్పించాలని.. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి కూడా లేఖ రాస్తున్నట్టు ఈటల స్పష్టం చేశారు. ఆక్సిజన్ కొరత కూడా ఉన్నందున అన్ని హాస్పిటల్స్‌కు కేంద్రం నుంచి వచ్చే సిలిండర్లను అవసరం మేరకు సరఫరా చేయాలని సీఎం ఆదేశించినట్టు మంత్రి వెల్లడించారు. ఇక హోంఐసోలేషన్‌లో ఉన్నవారికి కూడా మెడికల్ కిట్‌లు అందించాలని అధికారులను అప్రమత్తం చేశారన్నారు. కరోనా నియంత్రణకు ప్రజలు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలని మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News