CM Chandrababu: రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఐదేళ్లు అస్తవ్యస్తంగా మారిన పాలనను గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఐదేళ్లు అస్తవ్యస్తంగా మారిన పాలనను గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. ఇవాళ గుంటూరు (Guntur)లో నారేడ్కో ప్రపార్టీ షో (Naredco Property Show)ను ప్రారంభించిన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమను నమ్మి 93 శాతం మంతి అభ్యర్థులను ప్రజలు గెలిపించారని అన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. పడకేసిన నిర్మాణ రంగానికి మళ్లీ ఊతమిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర జీడీపీ (GDP)లో రియల్ ఎస్టేట్ (Real Estate) వాటా 7.3 శాతంగా ఉందన్నారు. అది 2047 నాటికి 20 శాతానికి పెరుగుతోందని అంచనా వేశారు.
రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ (Real Estate) రంగాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో విధ్వంసం, బెదిరింపులే ఉండేవని అన్నారు. అన్ని రంగాల కంటే నిర్మాణ రంగం ఎక్కువగా నష్టపోయిందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక నిర్మాణ రంగానికి ప్రధమ ప్రాధాన్యతను ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో భూ సమస్యలు విపరీతంగా ఉన్నాయని.. తనకు తెలిసి 100 పిటిషన్లు వస్తే.. అందులో 60 నుంచి 70 పిటిషన్లు భూ సమస్యలవేనని తెలిపారు. అందుకే తాము ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ (Land Grabbing Act)ను తీసుకొచ్చామని అన్నారు. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.