రేపు నారా దేవాన్ష్ బర్త్ డే.. తిరుమలలో అన్నదానం చేయనున్న సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) కుటుంబం నేడు(గురువారం) తిరుమల(Tirumala)కు వెళ్లారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) కుటుంబం నేడు(గురువారం) తిరుమల(Tirumala)కు వెళ్లారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari), కోడలు నారా బ్రాహ్మణి(Nara Brahmini), మనవడు దేవాన్ష్(Devansh)తో కలిసి తిరుమలకు చేరుకున్నారు. శ్రీ పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ(TTD) అదనపు ఈవో వెంకయ్య చౌదరి(Venkaiah Chowdary) వారికి స్వాగతం పలికారు. ఈ తరుణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రేపు(శుక్రవారం) ఉదయం 8 గంటలకు దర్శనం చేసుకోనున్నారు.
దీనికి సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్(TTD Chairman) బీఆర్ నాయుడు(BR Naidu) చూసుకుంటున్నారు. అయితే.. ప్రతి ఏడాది మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా దేవాన్ష్ బర్త్ డే సందర్భంగా నారా కుటుంబం తిరుమలకు వెళ్లినట్లు తెలుస్తోంది. నారా దేవాన్ష్ పుట్టినరోజు(మార్చి 21) నేపథ్యంలో అన్నప్రసాద కేంద్రంలో అయ్యే ఖర్చు రూ.44 లక్షలను సీఎం చంద్రబాబు భరించనున్నారు.